: సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై తెలుగు రాష్ట్రాల మంత్రులు భేటీ కావాలి: కేఈ కృష్ణమూర్తి


తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న సాగునీటి ప్రాజెక్టుల వివాదం అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తి మరోసారి స్పందించారు. ఈరోజు కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు అనుమతులున్నాయంటూ కొందరు నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులు లేవని ఆయన అన్నారు. ఆర్డీఎస్ పై చెలరేగుతోన్న వివాదంపై ఇరు రాష్ట్రాల మంత్రులు భేటీ కావాలని సమస్యకు పరిష్కారంపై చర్చించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News