: లే అవుట్, భవన నిర్మాణం, భూ బదలాయింపు అనుమతులు.. ఇక అన్నీ ఆన్‌లైన్ ద్వారానే: కేటీఆర్
లే అవుట్, భవన నిర్మాణం, భూ బదలాయింపు.. ఇకపై వీటి అనుమతులన్నీ ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ఆయన హెచ్‌ఎండీఏలో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఇళ్ల నిర్మాణాల కోసం అనుమతులు తీసుకోవడం కష్టంగా ఉండేదని అన్నారు. ఇకపై ప్రజలు ఆ కష్టాలనుండి విముక్తి పొందవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ విధానం ద్వారా దళారీ వ్యవస్థను అరికట్టవచ్చని ఆయన అన్నారు. అనుమతులు పొందడంలో ఇకపై మరింత పారదర్శకత కనపడనుందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్ విధానాన్ని త్వరలోనే జీహెచ్‌ఎంసీలో ప్రవేశపెడతామని అన్నారు. జూన్ కల్లా అన్ని పురపాలక పట్టణాల్లో ఆన్‌లైన్ సేవలు ప్రారంభిస్తామన్నారు.