: బాబుగారూ... మీ ఎమ్మెల్యేలు ఆడా, మగా కాని ‘మాడా’లా?: ‘ఆకర్ష్’పై నిప్పులు చెరిగిన చెవిరెడ్డి


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’పై వైసీపీ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిప్పులు చెరిగారు. కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష నేటికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన చెవిరెడ్డి... టీడీపీ చేపట్టిన ఆకర్ష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తం పాలనను పక్కనపెట్టిన చంద్రబాబు... వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని తన పార్టీలోకి చేర్చుకునే పనిలోనే నిమగ్నమయ్యారన్నారు. వైఎస్ జగన్ గెలిపించిన వారి పట్ల అంతగా ఆసక్తి కనబరచడానికి కారణమేంటని చెవిరెడ్డి ప్రశ్నించారు. జగన్ గెలిపించిన ఎమ్మెల్యేలను చెవిరెడ్డి ‘మగాళ్లు’గా అభివర్ణించారు. జగన్ గెలిపించిన ఎమ్మెల్యేల వైపు చూస్తున్న చంద్రబాబుకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మీ పార్టీలో మగాళ్లు లేరా? మీ ఎమ్మెల్యేలంతా ఆడంగులా? కాదు కాదు, ఆడంగులంటే మహిళలు ఆగ్రహిస్తారు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆడా, మగా కాని ‘మాడా’లా?’’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News