: అమెరికా ప్రజలలో చీలిక... నల్లజాతి వారు, వలసొచ్చిన వారు హిల్లరీ వైపు, తెల్లవారు ట్రంప్ వైపు!


తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలన్న విషయమై అమెరికన్లలో చీలిక వస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. యూఎస్ లోని తెల్లవాళ్లు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ఉండగా, నల్లజాతి వారు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు మద్దతిస్తున్నట్టు ఎన్బీసీ న్యూస్ తన తాజా సర్వే అనంతరం ప్రకటించింది. ఈ సర్వే వివరాల ప్రకారం, గతంతో పోలిస్తే హిల్లరీకి వస్తున్న మద్దతు 48 శాతం నుంచి 45 శాతానికి తగ్గిందని పేర్కొంది. ఆఫ్రికన్ అమెరికన్లు, వలస వచ్చిన వారు, హిస్పానిక్ ఓటర్లలో (లాటిన్ అమెరికాలోని స్పెయిన్ వాసులు) హిల్లరీకి 75 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. ఇక తెల్లవారిలో హిల్లరీకన్నా ట్రంప్ కు 14 శాతం మంది అధికులు మద్దతిస్తున్నారు. స్వతంత్ర ఓటర్లలో 44 శాతం మంది ట్రంప్ కు, 36 శాతం మంది హిల్లరీకి ఓటేయనున్నట్టు ఎన్బీసీ వెల్లడించింది. ఆన్ లైన్లో ఈ సర్వేను నిర్వహించామని, 12,507 మంది రిజిస్టర్డ్ ఓటర్లు పాల్గొన్నారని పేర్కొంది.

  • Loading...

More Telugu News