: విజయవాడ కార్పొరేటర్ చంటిబాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!... నోటీస్ అందజేసిన శంషాబాదు పోలీసులు!


విమానంలో పక్క సీట్లో కూర్చున్న మహిళా ప్రొఫెసర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్న టీడీపీ నేత, విజయవాడ 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో చంటిబాబుపై బాధితురాలు శంషాబాదు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంటిబాబును విచారించేందుకే నిర్ణయించుకున్న శంషాబాదు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్న శంషాబాదు పోలీసులు చంటిబాబుకు స్వయంగా నోటీసులు అందజేశారు. వారంలోగా హైదరాబాదు వచ్చి తమ ముందు విచారణకు హాజరుకావాలని సదరు నోటీసుల్లో ఆయనకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News