: సచిన్, ధోనీలను చూస్తా... 'అజర్' చూడను: రవిశాస్త్రి
"వాస్తవ జీవితంలో అజారుద్దీన్ అంటే ఏంటో నాకు తెలుసు. ఇక అతని కథ అంటూ తెరకెక్కిన సినిమా చూడాల్సిన అవసరం లేదు" అని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అజర్ కథ ఆధారంగా నిర్మించిన సినిమాను చూసే ఉద్దేశం లేదని, ఇదే సమయంలో సచిన్, ధోనీ బయోపిక్ లను మాత్రం చూడాలని ఉందని ఆయన అన్నాడు. కాగా, 'అజర్' సినిమాలో రవిశాస్త్రిని ప్లే బాయ్ గా, నిత్యమూ ఆడవాళ్లతో గడుపుతూ ఉండే వ్యక్తిగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే. శాస్త్రి ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కాగా, అజర్, శాస్త్రిలు ఇండియాకు 45 టెస్టులు, 116 వన్డే మ్యాచ్ లలో కలిసి ఆడారు.