: రుద్రపాకకు క్యూ కట్టిన టీడీపీ నేతలు... సాహిత్యవాణి అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు


కృష్ణా జిల్లాలోని రుద్రపాక గ్రామానికి టీడీపీ నేతలు బారులు తీరారు. ఇప్పటికే మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావులు ఆ గ్రామానికి చేరుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సతీమణి సాహిత్యవాణి నిన్న చనిపోయిన సంగతి తెలిసిందే. మొన్న రాత్రి హైదరాబాదు సమీపంలోని తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారు. నిన్న సాయంత్రానికే ఆమె భౌతికకాయం స్వగ్రామం రుద్రపాకకు చేరింది. మరికాసేపట్లో సాహిత్యవాణి అంతిమ యాత్ర మొదలు కానుంది. ఈ యాత్రలో పాల్గొనడంతో పాటు పిన్నమనేనిని పరామర్శించేందుకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రుద్రపాకకు చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా పిన్నమనేని సతీమణి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News