: భర్తతో హనీమూన్ నుంచి తిరిగొస్తూ... బురఖా ధరించి మరో వ్యక్తితో మాయమైన భార్య!
వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. హనీమూన్ కు ఏకంగా హిమాలయాలకు వెళ్లారు. కొన్ని రోజులు ఆనందంగా గడిపి వెనక్కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో వాష్ రూముకు వెళ్లిన భార్య, ఎంత సేపటికీ తిరిగిరాక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. సీసీటీవీ ఫుటేజ్ చూశాక విషయం తెలుసుకుని 'ఛీ' అనుకుని ఫిర్యాదు కూడా చేయకుండానే వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీపీ ఫుటేజ్ వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే... హిమాలయాల్లోని బాగ్ గోద్రాలో హనీమూన్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఓ జంట ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగింది. ఆపై వాష్ రూములోకంటూ వెళ్లిన భార్య, లోపలే ఓ బురఖా ధరించి బయటకు వచ్చింది. ఆపై వెళ్లి మరో వ్యక్తిని కలవగా, వీరిద్దరినీ ఇంకో వ్యక్తి కలిశాడు. ముగ్గురూ కలిసి టాక్సీల స్టాండ్ కు వెళ్లి మాయమయ్యారు. ఆమె ప్రియుడు సైతం అదే విమానంలో వచ్చి వుండవచ్చని, అతనితో ఆమె వెళ్లిపోయిందని పోలీసులు చెప్పగా, ఫిర్యాదు కూడా చేయకుండా భర్త వెళ్లిపోయాడు. దీనిపై ఎలాంటి కేసూ నమోదు కాలేదని ఢిల్లీ ఎయిర్ పోర్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.