: టాలీవుడ్ యువ హీరో తనీష్ తండ్రి దుర్మరణం!... ఆరో అంతస్తు నుంచి కిందపడిన వైనం
టాలీవుడ్ యువ హీరో తనీష్ తండ్రి వర్ధన్ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత దుర్మరణం పాలయ్యారు. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్ మెంటులో తనీష్ కుటుంబం నివాసముంటోంది. నిన్న రాత్రి తమ ఫ్లాట్ లోని రెయిలింగ్ వద్దకు వచ్చిన ఆయన అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఆరో అంతస్తు నుంచి కింద పడిన కారణంగా వర్ధన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే వర్ధన్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.