: ఇండియన్, మొరాకో ఫుడ్ మిక్స్ చాలా బాగుంది: డైరెక్టర్ క్రిష్


ఇండియన్, మొరాకో ఫుడ్ మిక్స్ తనకు చాలా నచ్చిందని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం డైరెక్టర్ క్రిష్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ మొరాకో దేశంలో ఏడు రోజులుగా జరుగుతోంది. షూటింగ్ సెట్ లో భోజనాలు చేసేటప్పుడు తీసిన కొన్ని ఫొటోలను క్రిష్ పోస్ట్ చేశారు. ఇందులో సినిమా యూనిట్ భోజనం చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. షూటింగ్ కోసం యూనిట్ మొత్తం కష్టపడి పనిచేస్తోందని క్రిష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెరకెక్కుతోంది.

  • Loading...

More Telugu News