: శిక్షణకు వచ్చిన బాలురపై క్రికెట్ కోచ్ లైంగిక వేధింపులు


క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చిన బాలురపై క్రికెట్ కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన తాజాగా వెలుగుచూసింది. హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన గురించి ఇన్ స్పెక్టర్ ఎన్.తిరుపతి రావు మాట్లాడుతూ, కొంత కాలంగా సలామ్ అనే వ్యక్తి క్రికెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కోచింగ్ నిమిత్తం వచ్చిన ఐదుగురు బాలురపై అసహజరీతి లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. విశ్రాంతి సమయంలో 12 నుంచి 16 ఏళ్ల లోపు విద్యార్థులను తన గదిలోకి పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడని తిరుపతిరావు తెలిపారు. సలామ్ పై కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News