: సైబరాబాద్ 'సీపీ' ఆనంద్ పేరు చెప్పి మా భూమి లాక్కోవాలని సీఐ చూస్తున్నాడు: ఓ రైతు కుటుంబం ఆరోపణ
సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఆనంద్ పేరు చెప్పుకుంటూ తమ 16 ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ఒక సీఐ ప్రయత్నిస్తున్నారంటూ ఒక రైతు కుటుంబం హెచ్చార్సీని ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్ మోహన్ రెడ్డి పై పాల వెంకటయ్య అనే రైతు ఈమేరకు ఫిర్యాదు చేశారు. సీఐ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన మానవహక్కుల కమిషన్ జూన్ 22వ తేదీ లోగా తమకు నివేదిక అందించాలని డీజీపీని ఆదేశించింది.