: ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చింది... మహిళను అగౌరవపరచిన ఆన్ లైన్ షాపింగ్ సంస్థ!
అమెజాన్ లో బెల్లీ బటన్ బార్ కోసం ఆన్ లైన్ ఆర్డరు చేసిన ఒక మహిళకు సెక్స్ టాయ్ ను సదరు సంస్థ పంపడంపై బాధితురాలు మండిపడుతోంది. న్యూయార్క్ కు చెందిన నోలీన్ గ్రీన్ (28) అనే ఇద్దరు బిడ్డల తల్లి ఇటీవల మూడు బెల్లీ బటన్ బార్ ల కోసం అమెజాన్ కు ఆన్ లైన్ ఆర్డర్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆర్డరు పార్శిల్ ను సదరు సంస్థ పంపింది. పార్శిల్ ను ఓపెన్ చేయగానే అందులో ఒక సెక్స్ టాయ్ ఉండటంతో నోలీన్ గ్రీన్ ఆశ్చర్యపడటమే కాకుండా ఒకింత అవమానంగా కూడా ఫీలైంది. ఈ విషయమై అమెజాన్ సంస్థను ఆమె నిలదీసింది. అందుకు స్పందించిన సదరు సంస్థ.. తాము పంపిన పార్శిల్ లో పొరపాటు జరిగితే దానిని వెనక్కి తీసుకుంటామని చెప్పింది. ఈ సందర్భంగా నోలీన్ గ్రీన్ మాట్లాడుతూ, ఆ పార్శిల్ లో సెక్స్ టాయ్ ను చూడగానే సిగ్గుతో చితికిపోయానని చెప్పారు. ఇద్దరు పిల్లలతో పాటు తన తల్లిదండ్రులు కూడా తమ ఇంట్లోనే నివసిస్తున్నారని... ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి పంపుతున్న అమెజాన్ సంస్థలో ఇక షాపింగ్ చేయనంటూ బాధిత మహిళ మండిపడింది.