: 4 వేల కిలోమీటర్ల రోడ్లేశాం, ఈ ఏడు ఐదు వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తాం: చంద్రబాబు


హంద్రీనీవా, తోటపల్లి, పట్టిసీమ వంటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో పూర్తి చేసి, ప్రజల అవసరాలకు నీరు సరిపోయేలా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం వల్ల సాగు, తాగునీటి సమస్యలు తొలగుతాయని అన్నారు. ప్రతి గ్రామానికి నీళ్లు అందించాలని చూస్తున్నామని ఆయన తెలిపారు. తాము చెప్పిన విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన అన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, విత్తనాలు, ఎరువులు అందించామని ఆయన తెలిపారు. రైతు ఒకే పంట పండించడం వల్ల రిస్క్ పెరుగుతుందని ఆయన చెప్పారు. పంటల డైవర్సిటీ వల్ల ఉత్పత్తి పెరుగుతుందని ఆయన చెప్పారు. యాంత్రీకరణ వల్ల ఖర్చు తగ్గుతుందని తాము సూచించామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 వేల కిలోమీటర్ల రోడ్డు వేశామని ఆయన తెలిపారు. వచ్చే ఏడు 5 వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రాల్లో వచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుని, దీని ఆధారంగా భవిష్యత్ లో మంచి వ్యవసాయం చేయడానికి కృషి చేస్తారన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News