: ప్రపంచ మార్కెట్లోకి రానున్న సోనీ ఎక్స్ పీరియా 'ఎక్స్' సిరీస్
సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ సిరీస్ లో తొలి ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి విడుదల కానుంది. సోనీ ఎక్స్ పీరియా 'ఎక్స్ఏ అల్ట్రా' పేరిట ఉన్న ఫోన్ ని సంస్థ తన వెబ్ సైట్ లో పెట్టింది. త్వరలోనే పలు దేశాల్లో విడుదల కానున్న ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే... ఆరు అంగుళాల టచ్ స్క్రీన్, 1080X1920 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం, 3జీ ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో మెమొరీని 200 జీబీ వరకు పెంచుకునే సదుపాయం.. మొదలైన ఫీచర్లు ఈ సిరీస్ ఫోన్లలో ఉన్నాయి.