: ఏపీ రాజకీయాలను మాపై రుద్దకండి, ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోం: మంత్రి తలసాని ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టులపై వైఎస్సార్ సీపీ అధినేత దీక్షకు దిగడం, ఏపీ మంత్రుల నుంచి విమర్శలు వస్తోన్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ తీరు సరిగ్గాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సీఎం, మంత్రులపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ఆయన అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహింబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడం కోసం ప్రారంభించిన ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఆపేయాలని ఆయన సూచించారు.