: ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ను కలవనున్న ఎంపీ కవిత!
నిజామాబాద్ లోని షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని, ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రేపు హైదరాబాద్ కు వెళ్లనున్నామని ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల జీతాలు, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై చర్చిస్తామని ఆమె వివరించారు. నేడు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించిన ఆమె, పనుల ఆలస్యంపై మండిపడ్డారు. గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యమైతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు మేలు కలిగించే పనులను మరింత వేగంగా చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.