: రెండ్రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలి... దేవినేనికి మరోసారి ఫోన్ చేసిన హరీశ్ రావు
ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి తాను ఇప్పటి వరకు ఐదారు సార్లు ఫోన్ చేశానని, అయినా దేవినేని స్పందించలేదని ఇటీవల తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వాపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు హరీశ్‌రావు మరోసారి దేవినేనికి ఫోన్ చేశారు. ఆర్డీఎస్తో పాటు తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివాదాలపై చర్చకు ఆహ్వానించారు. రెండ్రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని దేవినేనికి హరీశ్‌రావు సూచించారు. లేదంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎలాంటి సాయం లభించదని ఆయన తేల్చిచెప్పారు. ఏపీ వైఖరిపై కృష్ణా రివర్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. రాయచూరు కలెక్టరుకు కర్నూలు కలెక్టర్ లేఖ రాయడంపై ఈ సందర్భంగా హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.