: నేను నాలానే ఉంటాను...గొప్పవాడిని అనిపించుకోవాలన్న కోరిక లేదు: మహేష్ బాబు


'నేను నాలానే ఉంటా'నని మహేష్ బాబు చెప్పాడు. ఎవరినైనా అనుకరించాలని ప్రయత్నిస్తే మన గుర్తింపు ఉండదని, మనం మనలానే ఉండాలని మహేష్ బాబు తెలిపాడు. బ్రహ్మోత్సవం సినిమా ప్రమోషన్ సందర్భంగా మహేష్ ను సమంత ఇంటర్వ్యూ చేస్తూ, 'దర్శకుడు బాగుందని చెప్పినా 'వన్ మోర్ టేక్' అని మీరు ఎందుకు అడుగుతారు?' అంటూ అడిగింది. దానికి మహేష్ బాబు సమాధానమిస్తూ, పదేపదే టేకులు చేసి, ఒకే సీన్ నాలుగైదు రకాలుగా చేసి, నేను గొప్పవాడిని అనిపించుకోవాలన్న కోరిక తనకు లేదని అన్నాడు. దర్శకుడు తనకు కథ చెప్పినప్పుడు వచ్చిన ఫీల్ వచ్చిందా? లేదా? అని పదే పదే చెక్ చేసుకుంటానని, ఒకట్రెండు సందర్భాల్లో దర్శకుడు తనకు చెప్పడానికి ఇబ్బంది పడినా, ఆ ఫీల్ లేకుండా తీసేయడానికి తాను తీసుకునే టేక్ లు పని చేస్తాయని అన్నాడు. ఈ తరువాత మోనిటర్ లో చూసుకుని ఏది బాగుంటే అది ఉంచుకుంటామని మహేష్ తెలిపాడు. ఒకసారి సినిమా థియేటర్ కెళ్లిపోయిన తరువాత బాగా చెయ్యాలని భావించినా, అది చేయలేమని, అందుకే ఒకటికి రెండు సార్లు షూట్ చేయించుకుని, దర్శకుడు ఊహించిన ఫీల్ వచ్చిందని చెప్పిన తరువాతే విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. దీంతో సమంత ఫిదా అయిపోయింది.

  • Loading...

More Telugu News