: 'బ్రహ్మోత్సవం' గురించి మహేష్, సమంత తెలుగులో...కాజల్ ఆంగ్లంలో ఏమన్నారంటే...!
'బ్రహ్మోత్సవం' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో ఆయా నటీనటులు తెలుగు బుల్లితెరను హోరెత్తిస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు, సమంత, కాజల్ సినిమా గురించి చెప్పారు. మహేష్ బాబు ఎప్పట్లాగే తెలుగులో చక్కగా మాట్లాడితే, సమంత కూడా తెలుగులో గలగలా మాట్లాడింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా పారితోషికమందుకునే కాజల్ మాత్రం తనకు తెలుగు తెలియనట్టు ఇంగ్లిష్ లో మాట్లాడింది. 'బ్రహ్మోత్సవం' అంటే పండగ అని, చుట్టాలంతా ఓ పది రోజులు ఇంటికి వచ్చి ఉండి వెళ్తే ఎంత సంతోషం కలుగుతుందో ఈ సినిమా చూసినా అంతే సంతోషం కలుగుతుందని మహేష్ బాబు చెప్పాడు. బంధాల గురించి తనకు కొంత అవగాహన ఉందని, శ్రీకాంత్ అడ్డాలతో రెండు సినిమాల్లో నటించిన తరువాత బంధాలపై తన అభిప్రాయాలు మార్చుకున్నానని సమంత చెప్పింది. వీరిద్దరూ చెప్పిన విషయాలనే కాజల్ ఇంగ్లిష్ లో చెప్పింది.