: పిన్నమనేని భార్య మృతిపై వైఎస్ జగన్ సంతాపం
ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సాహిత్యవాణి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలిపారు. కాగా, నిన్న అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో పిన్నమనేనికి తీవ్ర గాయాలు కాగా, ఆయన భార్య, కారు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ఈ ప్రమాదంలో వారు దుర్మరణం చెందారు. కారు ఎక్కగానే సీటు బెల్టు పెట్టుకున్న పిన్నమనేని గాయాలతో బయటపడ్డారు.