: అమరావతిలో అతిపెద్ద పుష్కర ఘాట్
మరో రెండు నెలల్లో రానున్న కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని అమరావతిలో అతి పెద్ద పుష్కరఘాట్ ను నిర్మించనున్నట్లు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి వద్ద పుష్కర ఘాట్లను మంత్రి పుల్లారావు, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.453 కోట్లతో పుష్కరాల పనులు ప్రారంభిస్తున్నామన్నారు. కృష్ణానదిలో ఏడు పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయనున్నామని, భక్తుల సౌకర్యార్థం అమరావతిలో 1.3 కిలోమీటర్ల మేర అతిపెద్ద పుష్కర ఘాట్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జులై 30 నాటికి పుష్కర పనులన్నీ పూర్తి చేస్తామని, గోదావరి పుష్కరాల కంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని పుల్లారావు పేర్కొన్నారు.