: తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు సన్నాహాలు: 50 మందికి ప్రతిభ అవార్డులు, కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న కేసీఆర్
రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రావతరణ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 20 రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50 మందిని కమిటీ ఎంపిక చేయనుంది. మరోవైపు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రావతరణ వేడుకలకు గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించనున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్రావతరణ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.