: చంద్రబాబుకు 'బాబుబలి పార్ట్-1' చూపించిన కేసీఆర్, అందుకే మూట సర్దేశారు: రోజా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విజయం సాధించాలనుకున్న చంద్రబాబు కుయుక్తులను తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా గుర్తు చేసుకున్నారు. ఆందుకు సంబంధించిన పక్కా ఆడియో, వీడియో సాక్ష్యాలను సంపాదించి, ఆపై చంద్రబాబుపై ఒత్తిడిని పెంచడం ద్వారా కేసీఆర్ 'బాబుబలి పార్ట్-1'ను చూపించారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దానికి భయపడే, చంద్రబాబు హైదరాబాద్ నుంచి మూట ముల్లె సర్దుకున్నారని, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ, హైదరాబాద్ అసెంబ్లీకి రావద్దని కేసీఆర్ చెప్పడంతోనే హడావుడిగా సచివాలయం నిర్మాణ పనులను వెలగపూడిలో చేపట్టారని విమర్శించారు. ఇక కేసీఆర్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఒక్క విమర్శ చేసినా ఆయనకు 'బాబుబలి పార్ట్-2' కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.