: కేసీఆర్ పనులకు ఆంధ్రా ప్రజలు ఏమైపోవాలి?: రోజా


ఎగువ ప్రాంతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ప్రాజెక్టులతో కర్నూలు, అనంతపురం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ ఆంధ్రా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రానుందని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కృష్ణా నదిపై ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు కూడా దిగువకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలని ఆమె ప్రశ్నించారు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడానికి కారణం ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికి పోవడమేనని విమర్శించారు. కేసీఆర్ ను చంద్రబాబు ఒక్క మాటన్నా, సాక్ష్యాలతో సహా వచ్చి ఆయన్ను జైల్లోకి పంపుతారని, అందువల్లే చంద్రబాబు లాలూచీ పడి ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ సైతం పక్క రాష్ట్రంపై ద్వేషాన్నే ప్రదర్శిస్తున్నారని, కృష్ణాపై ప్రాజెక్టులతో గాలేరు నగరి, హంద్రీనీవా, పోతిరెడ్డి పాటు, కేసీ కెనాల్ ప్రాజెక్టులు ఎందుకూ పనికిరాకుండా పోతాయని, ఈ విషయంలో కేసీఆర్ మరోసారి ఆలోచించుకోవాలని రోజా కోరారు.

  • Loading...

More Telugu News