: రఘురాం రాజనే మరోసారి ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాలి.. నెటిజన్ల సపోర్ట్
రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉండడంతో భారతీయ ఆర్థిక వ్యవస్థ కూలిపోతోందని, ఆయనను ఆ పదవినుంచి తీసేయాలని ఓ వైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర ఆరోపణలు కురిపిస్తోంటే, నెటిజన్ల నుంచి మాత్రం రాజన్‌కే సపోర్ట్ లభిస్తోంది. తాజాగా అంతర్జాలం వేదికగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆర్బీఐ గవర్నర్‌గా రాజనే ఫర్ఫెక్ట్ అని, రెండోసారీ ఆయనే ఈ బాధ్యతలు చేపట్టాలని సర్వేలో పాల్గొన్న అధిక శాతం నెటిజన్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రించడానికి వడ్డీరేట్లు తగ్గిస్తూ రాజన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని నెటిజన్లు ఓటు వేశారు. రఘురాం రాజన్‌పై సుబ్రహ్మణ్యస్వామి చేస్తోన్న వ్యాఖ్యలను నెటిజన్లు ఖండించారు. రాజన్‌పై ఎలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.