: దేశంలో చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబే: రోజా నిప్పులు


రాష్ట్రం కరవు బారిన పడి, ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రజలందరినీ గాలికి వదిలేసి విహారయాత్రలకు వెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమేనని వైకాపా ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. కేంద్రం నుంచి కరవు నిధులను సాధించుకోలేకపోయిన ఏకైక సీఎం ఆయనేనని ఎద్దేవా చేశారు. "చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉంటేనే కరవు వస్తుందని అందరికీ తెలుసు. ఇక పక్క రాష్ట్రాల్లో ఎందుకు కరవు వచ్చిందో తెలుసా? ఆయన ఎప్పుడైతే జాతీయ నాయకుడయ్యాడు అయ్యాడో, దేశం మొత్తం కరవు ఏర్పడిందనడంలో సందేహం లేదు. కరవు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితో కలిసేందుకు ప్రయత్నిస్తుంటే, ఆ విషయాన్ని వదిలి, రాష్ట్రంలో దోచుకున్న డబ్బును తన బినామీల పేరిట స్విట్జర్లాండ్ లో దాచుకునేందుకు వెళ్లొచ్చారు" అని విమర్శించారు. ఈ రెండేళ్ల కరవులో రూ. 4 వేల కోట్ల కరవు నష్టం ఏర్పడితే, ఆయన కనీసం రూ. 400 కోట్లను కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News