: విజ‌య‌వాడ‌లో తాగునీటి కాలుష్యం అల‌జ‌డి.. ఆసుప‌త్రికి క్యూ క‌ట్టిన జ‌నం


విజ‌య‌వాడ‌ పాతబస్తీలో తాగునీటి కాలుష్యం అల‌జ‌డి రేపింది. ఈరోజు ఉద‌యం నీటిని సేవించిన పాత‌బ‌స్తీవాసులు అస్వస్థతకు గురయ్యారు. నీరు తాగిన ప్రజలకు వాంతులు, విరేచనాలు కావడంతో స్థానికంగా అందరిలో భయాందోళనలు కలిగాయి. దగ్గరిలోని ఆసుప‌త్రులకు జనం క్యూ క‌ట్టారు. తాగునీరు కాలుష్యం జరిగిందని స‌మాచారం అందించినా కార్పొరేష‌న్ అధికారులు స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాగునీటిని సేవించిన ప్రజలందరూ వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News