: నిన్నటి నుంచి ఎవరికీ కనిపించని జయలలిత!
తమిళనాడులో ఎన్నికలు ముగిసిన మరుక్షణం వివిధ సంస్థల సర్వేల పరంగా ఫలితం ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రానుందని వెల్లడించిన నేపథ్యంలో, ఆమె గత రాత్రి నుంచి ఎవరికీ దర్శనమివ్వలేదు. పోయిస్ గార్డెన్ లోని తన ఇంటికి వచ్చిన కొందరు మంత్రులతో మాట్లాడడానికి కూడా ఆమె నిరాకరించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ఎల్లుండి విడుదలకానుండగా, అప్పటివరకూ అమ్మ దర్శనం ఎవరికీ లభించబోదని సమాచారం. కాగా, తమిళనాట డీఎంకే విజయం సాధించనుందని, గత మూడు దశాబ్దాల్లో ఏ పార్టీకీ వరుసగా రెండు సార్లు అధికార పీఠాన్ని ఇవ్వని తమిళనాడు ఓటర్లు మరోసారి సంప్రదాయాన్ని పాటించనున్నారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే.