: వేరే పనేం లేదు!... ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధాని కార్యాలయానికి చంద్రబాబు!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం సౌత్ బ్లాక్ కు చేరుకున్నారు. నేటి ఉదయం విజయవాడ నుంచి బయలుదేరిన చంద్రబాబు ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే వేరే పనేమీ పెట్టుకోకుండా నేరుగా ప్రధానమంత్రిత్వ కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లీ ఫ్లైటెక్కిన చంద్రబాబు... అదే ఊపులో ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు ఏపీలోని కరవు పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News