: తదుపరి ఐపీఎల్ మ్యాచ్ నుంచి మాక్స్ వెల్ ఆడబోడు: క‌్రికెట్ ఆస్ట్రేలియా
ప్రస్తుత సీజన్‌లో తదుపరి ఐపీఎల్ మ్యాచ్ నుంచి మాక్స్ వెల్ ఆడబోడని క‌్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మాక్స్‌వెల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. మాక్స్ వెల్ ఎడమ చేతికి గాయమైందని, వచ్చేనెల నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ట్రై సిరీస్ ఉండడంతో ఆల్‌రౌండర్ ప్రతిభ కనబర్చే మ్యాక్స్‌వెల్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎడమ చేతికయిన గాయంతో ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడని, అయితే ట్రై సిరీస్ ప్రారంభం నాటికి మ్యాక్స్‌వెల్ కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కీలక ఆటగాడు తమ జట్టునుంచి వైదొలగడం పంజాబ్ టీమ్ పెద్ద దెబ్బే.