: ఏపీ డీఎస్సీలో ఎంపికైన వారికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్.. జూన్1న అపాయింట్‌మెంట్ లెటర్లు
ఏపీ డీఎస్సీకి ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్1న వారి చేతికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందనున్నాయి. దీని కోసం ప్రక్రియ అంతా పూర్తయిందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. అనంతరం ఈనెల 28న తుదిజాబితా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అభ్యర్థులు ఈనెల 29 నుంచి 31 వరకు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.