: జేఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాలు వాస్తవమే!... ఆ నినాదాలివేనట!


విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ ను సింగిల్ షాట్ లో హీరోను చేసిన జవహర్ లాల్ నెహ్రూ ఘటనలో దేశ వ్యతిరేక నినాదాలు వినిపించిన మాట వాస్తవమే. ఫిబ్రవరి 9న ఢిల్లీలోని సదరు వర్సిటీలో ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అఫ్జల్ గురు ఉరితీతకు సంబంధించి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. అఫ్జల్ ఉరిని ‘జ్యూడీషియల్ కిల్లింగ్’గా అభివర్ణించిన ఓ వర్గం విద్యార్థులు దేశానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ మేరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) తనకు అందిన వీడియోలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సదరు ర్యాలీలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాల విషయానికి వస్తే... -తుమ్ కిత్నే అఫ్జల్ మారోంగే, ఘర్ ఘర్ సే అఫ్జల్ నికలేంగే -పాకిస్థాన్ జిందాబాద్ -కాశ్మీర్ మాంగే ఆజాదీ, లడ్కర్ లేంగే ఆజాదీ -కాశ్మీర్ కి ఆజాదీ తక్, జంగ్ రహేగీ- జంగ్ రహేగీ -భారత్ కి బర్బాదీ తక్, జంగ్ రహేగీ- జంగ్ రహేగీ -అఫ్జల్ కి హత్యా నహీ సహేంగీ... తరహా నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారు.

  • Loading...

More Telugu News