: ఇంటికే బీటెక్ ఓఎంఆర్ షీట్... రాస్తుండగా అడ్డంగా బుక్కయిన వైనం!
ఇది హైటెక్ మాస్ కాపీయింగ్ కే హైటెక్ కాపీ విధానం. సెల్ ఫోన్లు, బ్లూటూత్ లు, పెన్ స్కానర్లు కాదు... ఏకంగా ఆన్సర్ షీట్ నే ఇంటికి తీసుకెళ్లి రాస్తూ అడ్డంగా బుక్కయిన ఘనుల కథ ఇది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ శివారులోని బాటసింగారంలో ఉన్న అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో జి.వినీత్ గౌడ్ బీటెక్ మెకానికల్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. థర్డ్ ఇయర్ లో మిగిలిపోయిన ఒక సబ్జెక్టు పాస్ అయ్యేందుకు ఇంతవరకూ ఎవరూ చేయని పని చేశాడు. తన మిత్రుడితో కలసి నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ, చీఫ్ ఇన్విజిలేటర్ సునీల్ తో డీల్ కుదుర్చుకుని పరీక్షా పత్రాన్ని, ఓఎంఆర్ షీట్ ను ఇంటికి తీసుకెళ్లి పరీక్ష రాశాడు. ఇందుకోసం ఇచ్చింది ఎంతో తెలుసా? రూ. 10 వేలట. ఇంటికే ఓఎంఆర్ షీట్ చేరిందని, అక్కడే పరీక్షలు రాస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు రూ. 7,800 నగదు, 8 సెల్ ఫోన్లను, ఘటనకు సంబంధమున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.