: కాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు... ఇద్దరు ముష్కరుల హతం, మరో ఇద్దరు అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ లో మరోమారు ఉగ్రవాదులు బరి తెగించారు. షోపియాన్ లోకి చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులను భారత సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉన్న సైనికులు... అలికిడి కాగానే రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా కొనసాగుతున్న ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ లో కాల్పులు మొదలైన సమయంలోనే పూంచ్ సెక్టార్ లోనూ ఉగ్రవాదులు దొంగదెబ్బ తీసేందుకు యత్నించారు. అయితే అక్కడ కూడా అప్రమత్తంగా ఉన్న సైనికులు ఉగ్రవాదుల యత్నాలను అణచివేశారు. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టేసి మరో ఇద్దరు ఉగ్రవాదులను సజీవంగా అదుపులోకి తీసుకున్నారు.