: రాణించిన గంభీర్, మనీష్ పాండే...బెంగళూరుకు భారీ లక్ష్యం
కోల్ కతా వేదికగా జరుగుతున్న టీట్వంటీ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆకట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతాకు బెంగళూరు బౌలర్లు షాకిచ్చారు. ఆదిలోనే రాబిన్ ఉతప్ప (2) ను అవుట్ చేసి ఆకట్టుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు బెంగళూరుకు నిలవలేదు. దీంతో గౌతం గంభీర్ (51) కు జతకలిసిన మనీష్ పాండే (50) దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతున్న దశలో అర్ధ సెంచరీ చేసిన గంభీర్ అవుట్ కాగా, మరో అర్ధ సెంచరీ చేసిన మనీష్ పాండే కూడా కెప్టెన్ ను అనుసరించాడు. అనంతరం వచ్చిన యూసఫ్ పఠాన్ (6), సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అనంతరం ఆండ్రీ రస్సెల్ (39), షకిబల్ హసన్ (18) చివర్లో మెరుపులు మెరిపించారు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో అరవింద్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకోగా, అబ్దుల్లా, చాహల్ చెరో వికెట్ తీసి అతనికి సహకరించారు. అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు గేల్ (26), కోహ్లీ (17) దూకుడుగా ఆడుతున్నారు. గేల్ ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో నాలుగు ఓవర్లలో బెంగళూరు 44 పరుగులు సాధించింది.