: తమిళ ఓటర్లకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన ‘ఏజీఎస్ సినిమాస్’!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈరోజు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్ 'ఏజీఎస్ సినిమాస్' బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎన్నికల్లో ఓటేసిన వారు ఎవరైతే తమ ఇంక్ ఫింగర్ సెల్ఫీని పోస్ట్ చేస్తారో వాళ్లందరికి సినిమా టికెట్ ఫ్రీగా ఇస్తామని సదరు యాజమాన్యం ప్రకటించింది. దీంతో, ఓటేసిన యువత తమ ఇంక్ ఫింగర్లను వెంటనే పోస్ట్ చేసి మల్టీప్లెక్స్ బాటపడ్డారు.