: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసిన తరుణ్ గొగోయ్
అసోంలో బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొట్టిపారేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 'అచ్చేదిన్ ఆయేంగే' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో మాటలు చెప్పారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా మంచి రోజులు రాలేదని ఆయన పేర్కొన్నారు. అసోంలో ఆయన ప్రభావం కనిపిస్తోందంటూ వెలువడిన వార్తలు వాస్తవం కాదని ఆయన పేర్కొన్నారు. అసోంలో విజయకేతనం ఎగురవేసేది తామేనని ఆయన తెలిపారు. కాగా, అసోంలో బీజేపీ విజయం సాధించి, తొలిసారి అధికారం చేపట్టనుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే.