: మహేష్ బాబు మాటల ‘పంచ్’ లు మామూలుగా ఉండవు: హీరోయిన్ సమంత


ప్రిన్స్ మహేష్ బాబుకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని దక్షిణాది హీరోయిన్ సమంత చెప్పింది. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గతంలో తాను మహేష్ బాబుతో చేసిన చిత్రాల కంటే త్వరలో విడుదల కానున్న ‘బ్రహ్మోత్సవం’ చాలా ప్రత్యేకమని చెప్పింది. మహేష్ బాబు చాలా హ్యూమరస్ అనే విషయం ఆయనతో కనెక్టయితేనే తెలుస్తుందని, లేకపోతే తెలియదని పేర్కొంది. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో మహేష్ పక్కన తనకు ఎక్కువ పాత్ర లేదని, అదే ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో ఎక్కువ నిడివి వుందని చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం మహేష్ తో కలిసి ఉదయ్ పూర్, హరిద్వార్, పూణె తదితర ప్రాంతాలకు వెళ్లామని పేర్కొంది. ‘మహేష్ గారు, నేను, వెన్నెల కిషోర్ గారు సెట్స్ లో చాలా ఫన్ గా, జోక్స్ వేస్తూ గడిపేవాళ్లం. చాలామందికి తెలియని విషయమేమిటంటే, మహేశ్ కు సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఎక్కువ. ఆయనతో కలిసిపోతేనే ఆ విషయం ఎవరికైనా తెలుస్తుంది. మహేష్ మాటల పంచ్ లు నాపై బాగానే పడ్డాయి' అని చెప్పింది. మహేష్ తో తనకు షూటింగ్ జరిగినన్ని రోజులు తనపై మాటల పంచ్ లు పడకూడదనుకుని మనసులో దేవుడికి దండం పెట్టుకునే దానినని సమంత పేర్కొంది.

  • Loading...

More Telugu News