: తమిళనాట అమ్మకు షాక్...కరుణానిధి వైపు మొగ్గు...ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు


తమిళులు ముద్దుగా అమ్మ అని పిలుచుకునే జయలలితకు మళ్లీ కష్టకాలం దాపురించినట్టు కనిపిస్తోంది. నేడు ముగిసిన ఎన్నికల్లో జయలలితకు ఓటర్లు షాక్ ఇచ్చారని న్యూస్ నేషన్ తెలిపింది. కరుణానిధి వైపు ఓటర్లు మొగ్గుచూపారని, డీఎంకేకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. న్యూస్ నేషన్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం...తమిళనాడులో అన్నా డీఎంకే 95 నుంచి 99 స్థానాలను గెలుచుకోబోతోందని తెలిపింది. అదే సమయంలో డీఎంకే 114 నుంచి 118 స్థానాల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోనుందని వెల్లడించింది. కెప్టెన్ విజయకాంత్ పార్టీ డీఎండీకే కేవలం 14 స్థానాలకే పరిమితం కానుందని ఈ సర్వే చెప్పింది. పీఎంకే ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. ఇతరులు 9 మంది గెలిచే అవకాశం ఉందని న్యూస్ నేషన్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News