: కోతులూ ఇతరుల చూపులను అర్థం చేసుకుంటాయట!
ఇతరుల చూపులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం మనుషులకే కాదు కోతులకు కూడా ఉంటుందట. హార్వర్డ్ వర్సిటీతో కలసి పెనోస్లోవియా వర్సిటీకి చేసిన పరిశోధనల్లో ఈ అంశం బయటపడింది. పరిశోధనలో భాగంగా కోతుల చూపును గమనించిన శాస్త్రవేత్తలకు ఆసక్తికర అంశాలు తెలిశాయి. శాస్త్రవేత్తలు చూసే చూపులకు కోతులు స్పందించాయని పరిశోధకులు తెలిపారు. తాము కళ్లను పైకి లేపి చూడగానే కోతులు శాస్త్రవేత్తల చూపులు అర్థం చేసుకొని అవి కూడా పైకి చూశాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు, యవ్వనంలో ఉన్న మగ కోతులను పరిశోధిస్తే అవి ఆడ కోతుల వైపు తరుచుగా చూసేవని పరిశోధకులు పేర్కొన్నారు. మనుషులు ఇతరుల చూపుని అర్థం చేసుకునే శక్తితో కోతుల చూపు పోలి ఉందని తెలిపారు. ఈ పరిశోధన కోసం 481 రైసిస్ కోతులను ఉపయోగించారు.