: రహస్యంగా పెళ్లి చేసుకుంటున్న 'అతిథి' హీరోయిన్
మహేష్ బాబుతో కలిసి 'అతిథి' సినిమాలో నటించిన అమృతా రావ్ గుర్తుందా?...ఆమె నేడు పెళ్లి కూతురైంది. ముంబైకి చెందిన రేడియో జాకీ అన్మోల్ తో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. వారిద్దరికీ ఎప్పుడో పెళ్లైపోయిందని, అయితే ఆ విషయాన్ని వెల్లడిస్తే ఆ ప్రభావం ఆమె అవకాశాలపై పడుతుందని భావించి, వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని బాలీవుడ్ లో కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిని వారిద్దరూ ఖండించారు. తాజాగా అదితి రావ్ చేతికి ఉంగరం కనిపించడంతో వివాహంపై వార్తలు బాలీవుడ్ లో హల్ చల్ చేశాయి. అయితే వారిద్దరూ నేడు కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ఒక్కటి కానున్నారని, కొన్ని రోజుల తరువాత బాలీవుడ్ ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వనున్నారని సమాచారం. 'ఇష్క్ విష్క్', 'మై హూ నా', 'వివాహ్' వంటి విజయవంతమైన సినిమాల్లో అమృతా రావ్ నటించింది.