: తొలి టెస్టులోనే వంద పరుగులు చేసిన నాటి క్రికెటర్ దీపక్ శోధన్ మృతి


తొలి టెస్టులోనే వంద పరుగులు చేసిన భారత తొలి క్రికెటర్ దీపక్ శోధన్ మృతి చెందారు. పాకిస్థాన్ తో 1952లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లోకి ప్రవేశించిన తొలి ఇన్నింగ్స్ లోనే ఆయన 110 పరుగులు చేశారు. ఆ మ్యాచ్ లో 179 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఎడమ చేతి వాటం ఆటగాడైన దీపక్ శోధన్ జట్టును ఆదుకున్నాడు. ఆ మ్యాచ్ లో మొత్తం 15 ఫోర్లు దీపక్ కొట్టారు. టెయిలెండర్ దత్తుతో కలిసి ఏడో వికెట్ నష్టానికి 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, భారత్-పాక్ ల మధ్య జరిగిన ఈ టెస్టు మ్యాచ్ డ్రా గా ముగియడంలో దీపక్ నాడు కీలక పాత్ర పోషించారు. అహ్మదాబాద్ కు చెందిన దీపక్ వయసు 87 సంవత్సరాలు.

  • Loading...

More Telugu News