: ఫ్యాషనబుల్ డ్రెస్ తో కేన్స్ లో సందడి చేసిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్


ఫ్యాషన్ కి అర్ధం మారిపోతోంది. స్టైల్ గా కనిపించడం ఫ్యాషన్ అనేది ఒకప్పుడు. మరి ఇప్పుడో? ఓ పది మందికి సరిపడే క్లాత్ ను చిత్రవిచిత్రంగా కుట్టించుకుని బారుగా రోడ్డంతా తుడుచుకుంటూ రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వెళ్తే...అదో కొత్త ఫ్యాషన్. ఇదేమి ఫ్యాషన్? అనే అనుమానం వచ్చిందా? ఇలాంటి అనుమానమే కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొని రెడ్ కార్పెట్ పై హొయలొలికించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ధరించిన డ్రెస్ చూసిన వారికి కూడా కలిగింది. లండన్ కి చెందిన ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ రాల్ఫ్ అండ్ రూసో సంస్థ రూపొందించిన డ్రెస్ ను ధరించిన సోనమ్ కపూర్ మాల్ దే పియార్ సినిమా స్క్రీనింగ్ కు హాజరైంది. రాల్ఫ్ అండ్ రూసో రూపొందించిన డ్రెస్ ను రెండో సారి ధరించిన సోనమ్, లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా గత ఆరేళ్లుగా కేన్స్ చిత్రోత్సవానికి హాజరవుతోంది. సోనమ్ ధరించిన తెల్లని గౌనుకు తగిలించిన ఎక్స్ ట్రా క్లాత్ ఓ ఐదుగురికి సరిపోతుందని చూసిన వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News