: వీరాభిమానం... సమంత ఫొటోలతో ఆమె చిత్రం!


ఓ అభిమాని ఆమెపై చూపిన వీరాభిమానానికి సమంత ఉబ్బితబ్బిబయిపోతోంది. అందుకే ఆ అభిమాని ట్వీట్ చేసిన ఫొటోను సమంత రీ ట్వీట్ చేసింది. ఇంతకీ ఆ ఫొటో ఏమిటంటే... సమంత నటించిన పలు చిత్రాల్లోని సుమారు 2916 ఫొటోలను ఉపయోగించి ఆమె రూపం వచ్చేలా ఒక కొలేజ్ ను ఆ వీరాభిమాని తయారు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా, ప్రిన్స్ మహేష్ సరసన సమంత నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది.

  • Loading...

More Telugu News