: మోదీజీ మౌనం వీడండి.. మాకు న్యాయం చేయండి.. విజయవాడలో మోదీ ఫ్లెక్సీలు
విజయవాడ నగరంలో ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ నేత కాట్రగడ్డ బాబు వేయించినట్లు కనిపిస్తోన్న ఈ ఫ్లెక్సీల ద్వారా ఏపీలోని పరిస్థితులపై మోదీ స్పందించాలని కోరారు. ఏపీకి ప్రత్యేకహోదా, ప్యాకేజీ, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల అంశాలపై మోదీ మౌనం వీడాలంటూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్ర విభజనతో ఎంతో నష్టబోయి, కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని ఫ్లెక్సీల ద్వారా మోదీని కోరారు. ఏపీ ఎదుర్కుంటోన్న పరిస్థితులపై మోదీ వెంటనే స్పందించాలని ఫ్లెక్సీల్లో విన్నవించుకున్నారు. అవసరమైతే ఏపీని ఆదుకోవడానికి రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు.