: ఆప్ కీ ఖేల్ ఖతమ్...వెరీ సూన్ అబ్బయ్యా!: జగన్ పై ఆనం తీవ్ర వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కర్నూలులో చేపట్టిన మూడు రోజుల దీక్షపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, జగన్ దొంగనాటకాలు కట్టిపెట్టాలని సూచించారు. జగన్! ఆప్ కీ ఖేల్ ఖతమ్...వెరీ సూన్ అబ్బయ్యా! అంటూ ఆయన తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ దీక్షను చూస్తుంటే తనకు చిరంజీవి సినిమాలోని 'జపం జపం జపం కొంగ జపం...తపం తపం తపం దొంగ తపం' పాట గుర్తుకొస్తోందని ఆయన చెప్పారు. జగన్ టైం అయిపోయిందని ఆయన పేర్కొన్నారు. జగన్ ఊరికే దీక్షలు చేస్తున్నారని, బలిసి దీక్షలు చేస్తున్నారని ఆయన చెప్పారు.