: అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం, జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఇవ్వాలి: గాలి
తెలంగాణ అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టులపై తాము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కర్నూలులో ఎవరికోసం దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ రైతులపై మొసలి కన్నీరుకారుస్తున్నారని, ఆయన చేస్తోన్న దీక్షపై స్పష్టత ఇవ్వాలని గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కుంటోన్న సమస్యలకు కారణం నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని, నాడు అందరూ మర్చిపోయిన తెలంగాణ అంశాన్ని లేవనెత్తింది ఆయనేనని గాలి ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సిద్దార్థ్‌నాథ్‌సింగ్ ప్రతికూలంగా స్పందించడం దురదృష్టకరమని గాలి ముద్దుకృష్ణమ అన్నారు. టీడీపీపై సిద్దార్థ్‌నాథ్‌సింగ్ అవాస్తవాలను ప్రచారం చేశారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై తాము వెనక్కితగ్గబోమని పేర్కొన్నారు.