: ‘పెంటగాన్’ భారత్‌కు చేసిన హెచ్చరికలపై భగ్గుమన్న చైనా
భారత్ సరిహద్దుల వెంట చైనా భద్రతా దళాలను మోహరిస్తోందని, ఆయుధాలు, సైనిక కేంద్రాలను నిర్మిస్తోందని అమెరికాలోని వాషింగ్టన్‌లోని యూనైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ ‘పెంటగాన్’ భారత్ ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, పెంటగాన్ కథనంపై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ కథనాన్ని వ్యతిరేకించింది. భారత్-చైనాల మధ్య సానుకూల వాతావరణాన్ని దెబ్బతీసేలా పెంటగాన్ కథనం ఉందని చెప్పింది. పెంటగాన్ కథనం వాస్తవాలకు దూరంగా ఉందని చైనా పేర్కొంది. చైనాని కాపాడుకునేందుకు అవసరమైన జాతీయ డిఫెన్స్ విధానాన్నే తమ దేశం అనుసరిస్తోందని, పెంటగాన్ అసత్య ప్రచారం చేసిందని తెలిపింది. అనవసరమైన అనుమానాలను కలిగించేలా పెంటగాన్ ప్రవర్తించిందని చైనా పేర్కొంది.