: వివాహేతర సంబంధం... మహిళపై యాసిడ్ దాడి


కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందూరు గ్రామంలో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. స్థానిక మహిళ, గ్రామానికి చెందిన రాజు(25)ల మధ్య వివాహేతర సంబంధం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం సదరు మహిళ ఇంటికి వెళ్లిన రాజు ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. సదరు మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు అక్కడికి చేరుకుని రాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News